ఏపీ మంత్రి అప్పలరాజును అడ్డుకున్న రైతులు, మహిళలు
- కంబిరిగాంలో మంత్రిని నిలదీసిన రైతులు
- పట్టాలిప్పిస్తానని చెప్పి అన్యాయం చేశారని ఆరోపణ
- మంత్రిని నిలదీస్తూ కీలక వ్యాఖ్యలు చేసిన మహిళ
సోమవారం నాడు కొత్త జిల్లాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న అనంతరం పలాసకు వెళుతున్న సందర్భంగా కంబిరిగాం సమీపంలో మంత్రి అప్పలరాజు కాన్వాయ్‌ను రైతులు, మహిళలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పట్టాలిప్పిస్తానని చెప్పిన మీరు ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రైతులు ప్రశ్నించారు. తొలుత షాక్‌కు గురైన మంత్రి.. ఆ తర్వాత తేరుకుని రైతులకు సర్దిచెప్పేందుకు యత్నించినా రైతులు వెనక్కు తగ్గలేదు. దీంతో రైతులను పక్కకు తోసేసిన పోలీసులు మంత్రి కాన్వాయ్‌ను అక్కడి నుంచి పంపేశారు.