YS Sharmila: అంతకు మించి కేసీఆర్ ఉద్ధరించేది ఏమిటి?: షర్మిల

Sharmila fires on KCR
షార్ట్స్‌లో చూడండి
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. మండుటెండలను సైతం లెక్క చేయకుండా ఆమె తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్ తీసుకొచ్చింది బంగారు తెలంగాణ కాదని, బాధల తెలంగాణ అని మండిపడ్డారు. ఎన్నికలు వచ్చినప్పుడు గారడీ మాటలు చెపుతారని, అంతకు మించి కేసీఆర్ ఉద్ధరించేది ఏమిటని ప్రశ్నించారు. కేసీఆర్ మాటలకు మళ్లీ మళ్లీ మోసపోవద్దని చెప్పారు. 

ఇతర పార్టీల్లో గెలిచి టీఆర్ఎస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై షర్మిల మండిపడ్డారు. వీరిది రాజకీయ వ్యభిచారం కాదా? అని ప్రశ్నించారు. మాట ఇస్తే మడమ తిప్పని వైఎస్ బిడ్డగా చెపుతున్నానని... తెలంగాణలో మళ్లీ రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తానని షర్మిల ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం షర్మిల పాదయాత్ర సూర్యాపేట జిల్లాలో ముగిసి, ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించింది. ప్రస్తుతం పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెంలో కొనసాగుతోంది.
Go Back to Shorts
YS Sharmila
YSRTP
KCR
TRS

More Telugu News