3 రాజధానులు, కొత్త జిల్లాల సంకల్ప లక్ష్యం ఒకటే: విజయసాయిరెడ్డి
- కొత్త జిల్లాల ఏర్పాటుపై సాయిరెడ్డి ట్వీట్
- అధికార వికేంద్రీకరణ కోసమే కొత్త జిల్లాలని వ్యాఖ్య
- 3 రాజధానుల లక్ష్యం కూడా అదేనని వెల్లడి
ఈ ట్వీట్ ప్రకారం అధికార వికేంద్రీకరణ లక్ష్యంగానే ఏపీలో సీఎం జగన్ కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారని సాయిరెడ్డి వివరించారు. చిన్న జిల్లాలతో అధికారులు ప్రజలకు మరింత చేరువ అవుతారని చెప్పిన సాయిరెడ్డి.. అభివృద్ధి కార్యక్రమాల అమలులో నవశకం మొదలు అవుతుందని చెప్పారు. ఇక తమ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న 3 రాజధానుల లక్ష్యం కూడా అధికార వికేంద్రీకరణేనని చెప్పిన సాయిరెడ్డి.. ఎవరు వ్యతిరేకించినా తమ ప్రభుత్వ లక్ష్యం అధికార వికేంద్రీకరణేనని తేల్చేశారు.