Sacramento: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం... ఆరుగురి మృతి

Six people died in Sacramento shooting
  • అమెరికాలో వేళ్లూనుకున్న తుపాకీ సంస్కృతి
  • శాక్రమెంటో నగరంలో తాజా ఘటన
  • విచ్చలవిడిగా కాల్పులు జరిపిన వైనం

తుపాకీ సంస్కృతికి పేరుమోసిన అమెరికాలో మరోసారి నరమేధం చోటుచేసుకుంది. తుపాకీ చేతబూనిన ఓ వ్యక్తి విచ్చలవిడిగా జరిపిన కాల్పుల్లో ఆరుగురు మరణించారు. మరో 9 మంది గాయపడ్డారు. కాలిఫోర్నియాలోని శాక్రమెంటో నగరంలో ఈ కాల్పుల ఘటన జరిగింది.

వెంటనే స్పందించిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అక్కడి రోడ్లను మూసివేశారు. కాల్పులు జరిపిన వ్యక్తి ఎవరన్నది గుర్తుపట్టగలరా? అని పోలీసులు స్థానికులను ఆరా తీస్తున్నారు. కాగా, కాల్పులు జరగడానికి ముందు శాక్రమెంటో డౌన్ టౌన్ లో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమికూడినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News