Liam Livingstone: టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్... లివింగ్ స్టోన్ దూకుడు

Liam Livingstone flamboyant innings after Punjab Kings lost early wickets
  • ముంబయిలో చెన్నై వర్సెస్ పంజాబ్
  • బౌలింగ్ ఎంచుకున్న చెన్నై
  • 14 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన పంజాబ్
  • భారీ షాట్లతో విరుచుకుపడిన లివింగ్ స్టోన్
ఐపీఎల్ తాజా సీజన్ లో భాగంగా ముంబయి బ్రాబౌర్న్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన చెన్నై జట్టు బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ జట్టు 14 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. అయితే, లియామ్ లివింగ్ స్టోన్ దూకుడుగా ఆడడంతో పంజాబ్ కోలుకుంది. 

లివింగ్ స్టోన్ 19 బంతుల్లోనే 45 పరుగులు చేయడం విశేషం. అతడి స్కోరులో 4 ఫోర్లు, 4 సిక్సులున్నాయి. ప్రస్తుతం క్రీజులో లివింగ్ స్టోన్, ఓపెనర్ శిఖర్ ధావన్ (20 బ్యాటింగ్) ఆడుతున్నారు. పంజాబ్ కింగ్స్ స్కోరు 7 ఓవర్లలో 2 వికెట్లకు 82 పరుగులు.
Liam Livingstone
Punjab Kings
Chennai Super Kings
IPL

More Telugu News