East Godavari District: పిఠాపురంలో కలకలం.. పదో తరగతి చదువుతున్న నలుగురు బాలికల అదృశ్యం

4 girl students who studies 10th class missing from pithapuram
  • గత నెల 30న పాఠశాలకు వెళ్లి తిరిగి రాని బాలిక
  • నిన్న తెల్లవారుజామున మరో ముగ్గురు అదృశ్యం
  • హైదరాబాద్ వెళ్లి ఉంటారని అనుమానం
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో పదో తరగతి చదువుతున్న నలుగురు బాలికలు అదృశ్యం కావడం కలకలం రేపింది. ఇద్దరు బాలికల కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మార్చి 30న పాఠశాలకు వెళ్లిన ఓ బాలిక ఆ తర్వాత ఇంటికి రాలేదు. నిన్న తెల్లవారుజామున మరో ముగ్గురు బాలికలు అదృశ్యమయ్యారు. 

అదృశ్యమైన బాలికల ప్రవర్తన బాగోలేదంటూ వారి తల్లిదండ్రుల సమక్షంలోనే ఉపాధ్యాయులు వారిని మందలించారు. దీంతో మనస్తాపం చెందిన బాలికలు ఇంటి నుంచి వెళ్లిపోయి ఉంటారని భావిస్తున్నారు. వీరందరూ కలిసి హైదరాబాద్ వెళ్లినట్టు అనుమానిస్తున్నారు. బాధిత విద్యార్థినుల తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
East Godavari District
Pithapuram
Girl Students
Missing

More Telugu News