AP Cabinet: కొత్త జిల్లాల రెవెన్యూ డివిజన్లలో మార్పులకు ఏపీ మంత్రివర్గం ఆమోదం

AP Cabinet gives nod to changes in revenue divisions
  • ఏపీలో 26 జిల్లాల ఏర్పాటు
  • తుది నోటిఫికేషన్ కోసం కసరత్తులు
  • రేపటిలోగా తుది నోటిఫికేషన్
  • నోటిఫికేషన్ వచ్చాక ఉద్యోగుల కేటాయింపు
ఏపీలో 26 జిల్లాలు ఏర్పాటు చేయడం తెలిసిందే. దీనికి సంబంధించి ఇవాళ రాత్రి గానీ, రేపటి లోగా గానీ తుది నోటిఫికేషన్ రానుంది. ఈ నేపథ్యంలో, కొత్త జిల్లాల రెవెన్యూ డివిజన్లలో మార్పులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రివర్గ సభ్యులకు అధికారులు వర్చువల్ గా నోట్ పంపగా, రెవెన్యూ డివిజన్లకు సంబంధించిన మార్పులను మంత్రివర్గం ఆమోదించింది. 

కాగా, కొత్త జిల్లాలపై తుది నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ చేపట్టనున్నారు. అధికారులు, ఉద్యోగుల కేటాయింపుపై జీవోలు ఇవ్వనున్నారు.
AP Cabinet
Revenue Divisions
New Districts
Andhra Pradesh

More Telugu News