Anupama Parameswaran: మచిలీపట్నంలో సందడి చేసిన అందాల అనుపమ... పోటెత్తిన అభిమానులు

Anupama Parameswaran in Machilipatnam
  • మచిలీపట్నంలో కిడ్స్ వేర్ విభాగాన్ని ప్రారంభించిన అనుపమ 
  • అనుపమ రాకతో షాపింగ్ మాల్ వద్ద కోలాహలం
  • అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ముద్దుగుమ్మ 
టాలీవుడ్ అందాల నటి అనుపమ పరమేశ్వరన్ మచిలీపట్నం విచ్చేశారు. పట్టణంలో ఓ షాపింగ్ మాల్ లో ఏర్పాటు చేసిన కిడ్స్ వేర్ విభాగాన్ని అనుపమ ప్రారంభించారు. ఆమె రాకతో షాపింగ్ మాల్ వద్ద అభిమానులు పోటెత్తారు. ఫ్యాన్స్ భారీగా తరలిరావడంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. 

అనుపమ బయటికి రాగానే, ఆమెను చూసి ఈలలు, కేకలతో హోరెత్తించారు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అంటూ అనుపమ చెప్పగా, ఫ్యాన్స్ కేరింతలు కొట్టారు. వారి ఉత్సాహాన్ని, అభిమానాన్ని చూసి అనుపమ కూడా చిరునవ్వులు చిందిస్తూ ఎంతో ఆస్వాదించారు.
Anupama Parameswaran
Machilipatnam
Kids Ware
Opening
Tollywood

More Telugu News