Vijay: టెర్రరిస్టులపై విరుచుకుపడిన సోల్జర్ విజయ రాఘవన్ .. 'బీస్ట్' ట్రైలర్!

Beast Movie trailer released
  • విజయ్ తాజా చిత్రంగా 'బీస్ట్'
  • కథానాయికగా పూజ హెగ్డే 
  • దర్శకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ 
  • ఈ నెల 13వ తేదీన విడుదల
విజయ్ కి తమిళనాట ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. అక్కడి మాస్ ఆడియన్స్ లో ఆయనకి విపరీతమైన క్రేజ్ ఉంది. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి  'బీస్ట్' సిద్ధమవుతోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ వారు నిర్మించిన ఈ సినిమాను ఈ నెల 13వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం ట్రైలర్ ను రిలీజ్ చేశారు. అమాయకులైన ప్రజలను కొంతమంది తీవ్రవాదులు బంధిస్తారు. ఆ తీవ్రవాదుల బారి నుంచి ప్రజలను రక్షించి తీసుకుని రావడానికి సోల్జర్ విజయ్ రాఘవన్ గా విజయ్ రంగంలోకి దిగుతాడు. ఆ నేపథ్యంలో చోటుచేసుకునే యాక్షన్ సీన్స్ పై ఈ ట్రైలర్ ను కట్ చేశారు.

సినిమాలో ఒక కీలకమైన సందర్భంలో ఈ ఎపిసోడ్ వస్తుందనీ .. ఈ సీన్లోనే హీరోగారి లవ్ లో హీరోయిన్ పడుతుందనే విషయం అర్థమవుతోంది. అనిరుధ్ సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. 'మాస్టర్' తరువాత విజయ్ నుంచి వస్తున్న ఈ సినిమా, అభిమానుల అంచనాలను అందుకుంటుందేమో చూడాలి.
Vijay
Pooja Hegde
Beast Movie

More Telugu News