Shah Rukh Khan: నీ షాట్ తో బాల్ కే ఊపిరి వచ్చింది: రస్సెల్ ఆటపై షారూక్ ఖాన్ వ్యాఖ్య

Shah Rukh Khan delighted with Andre Russell BATTING
  • జట్టు ఆట తీరు పట్ల ట్విట్టర్ లో స్పందన
  • మిత్రుడు రస్సెల్ కు స్వాగతం అంటూ ట్వీట్
  • టీమ్ బాగా ఆడిందంటూ షారూక్ ప్రశంసలు

ఆండ్రూ రస్సెల్ బ్యాటింగ్, కేకేఆర్ జట్టు విజయంపై ఫ్రాంచైజీ యజమాని, బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ విభిన్నంగా స్పందించాడు. పంజాబ్ కింగ్స్ పై శుక్రవారం కేకేఆర్ చక్కని విజయం నమోదు చేయడం తెలిసిందే. ఇదంతా కూడా రస్సెల్ బ్యాటింగ్ వల్లే సాధ్యమైందని చెప్పుకోవాలి. కేవలం 31 బంతుల్లో 70 పరుగులు సాధించాడు. దీంతో 138 పరుగుల లక్ష్యాన్ని మరో 5.3 ఓవర్లు మిగిలి ఉండగానే కేకేఆర్ పూర్తి చేసేసింది.

దీనిపై కేకేఆర్ యజమాని షారూక్ ఖాన్ ట్విట్టర్లో స్పందించాడు. ’’నా స్నేహితుడు రస్సెల్ కు తిరిగి స్వాగతం. చాలా సమయం పాటు బంతి అలా అంత ఎత్తుకు ఎగరడం చూశాను. నీవు ఆ బంతిని కొట్టినప్పుడు దానంతట అదే ఊపిరి తీసుకుని ప్రయాణించింది’’ అంటూ షారూక్ ఖాన్ ట్వీట్ చేశాడు. ఉమేష్ యాదవ్ తోపాటు, శ్రేయాస్ అయ్యర్, జట్టు మొత్తం చక్కగా ఆడిందని ప్రశంసించాడు.

  • Loading...

More Telugu News