RRR: ఆర్ఆర్ఆర్ కు సీక్వెల్.. ఎన్టీఆర్ అడిగితే కథలు చెప్పానన్న విజయేంద్ర ప్రసాద్

Vijayendra Prasad On RRR Sequel
షార్ట్స్‌లో చూడండి
రికార్డ్ వసూళ్లతో ఆర్ఆర్ఆర్ థియేటర్లలో దూసుకెళ్తోంది. వారం రోజుల్లోనే 710 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించి చరిత్ర సృష్టించింది. అయితే, అప్పుడే ఈ సినిమా సీక్వెల్స్ పై చర్చోపచర్చలు సాగుతున్నాయి. దీనిపై ‘ఆర్ఆర్ఆర్’కు కథ అందించిన విజయేంద్రప్రసాద్ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. 

ఓ రోజు ఎన్టీఆర్ తన ఇంటికి వచ్చి ఆర్ఆర్ఆర్ సీక్వెల్ గురించి అడిగాడని చెప్పారు. దీంతో తాను కొన్ని ఐడియాలు చెప్పానని, అవి తారక్, రాజమౌళికి బాగా నచ్చాయని తెలిపారు. ఒకవేళ దైవానుగ్రహం ఉంటే ‘ఆర్ఆర్ఆర్’కు సీక్వెల్ వస్తుందని విజయేంద్ర ప్రసాద్ సూత్రప్రాయంగా తెలిపారు.
Go Back to Shorts
RRR
K V Vijayendra Prasad
Rajamouli
Junior NTR
Ramcharan

More Telugu News