Gopichand: 'పక్కా కమర్షియల్' నుంచి కొత్త పోస్టర్!

  • మారుతి నుంచి 'పక్కా కమర్షియల్'
  • గోపీచంద్ సరసన రాశి ఖన్నా 
  • సంగీత దర్శకుడిగా జేక్స్ బిజోయ్
  • జులై 1వ తేదీన విడుదల 
Pakka Commercial special poster released

మారుతి నుంచి వచ్చిన 'ప్రతి రోజూ పండగే' సినిమా ఒక మంచి సందేశాన్ని ఇవ్వగలిగింది. అయితే ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయింది. ఆ తరువాత కరోనా కారణంగా మారుతి నుంచి కూడా గ్యాప్ వచ్చేసింది. ఈ మధ్య కరోనా కాస్త తగ్గగానే, 'మంచి రోజులు వచ్చాయి' అనే ఒక చిన్న సినిమాతో తన మార్కు వినోదాన్ని అందించే ప్రయత్నం చేశాడు.

ఇక ఆ తరువాత  గోపీచంద్ హీరోగా 'పక్కా కమర్షియల్' సినిమాను రూపొందించాడు. ఈ సినిమాలో కథానాయికగా రాశి ఖన్నా అలరించనుంది. ఉగాది పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ రొమాంటిక్ పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది.

 యూవీ క్రియేషన్స్ - గీతా ఆర్ట్స్ 2 నిర్మించిన ఈ సినిమాకి జేక్స్ బిజోయ్ సంగీతాన్ని సమకూర్చాడు. 'జిల్' తరువాత గోపీచంద్ - రాశి ఖన్నా కలిసి నటించిన సినిమా ఇది. సత్యరాజ్ .. రావు రమేశ్ .. అనసూయ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను జూలై 1వ తేదీన విడుదల చేయనున్నారు.

More Telugu News