eating: ఆహారం విషయంలో ఈ తప్పులు చేయొద్దు

  • నిర్ణీత వేళల్లోనే ఆహారం తీసుకోవాలి
  • లేదంటే ఆకలి సంకేతాలు పనిచేయవు
  • ఆకలి లేనప్పుడు ఆహారం తీసుకోవడం మంచిది కాదు
  • ఆహారానికి ముందు, తర్వాత నీరు తాగరాదు
  • కనీసం గంట విరామం అయినా ఉండాలి
eating mistakes that are playing havoc with your digestion

తరచూ జీర్ణపరమైన అసౌకర్యం, సమస్యలు ఎదుర్కొంటున్నారా..? అయితే మీరు ఆహారం విషయంలో కొన్ని తప్పులకు దూరంగా ఉండాలి. మలబద్ధకం, గుండెలో మంట, కడుపు ఉబ్బరం ఇలాంటి సమస్యలు కనిపించినా సరే ఆహారం విషయంలో కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. 


మారిన జీవనశైలికితోడు ఆహారపరమైన మార్పులు సైతం జీర్ణ సమస్యలకు కారణమవుతున్నాయి. కనుక కారణం ఏదన్నది తెలియనప్పుడు సమస్య నుంచి బయటకు వచ్చేందుకు కొన్ని పద్ధతులను పాటిస్తే మంచిది.

ఆకలి ముఖ్యం..
ఆహారానికి నిర్ణీత వేళలను నిర్ణయించుకోవడం మంచి విధానం. ఆకలి లేనప్పుడు తినడం అంటే మెదడు సంకేతాలను పట్టించుకోకపోవడం అవుతుంది. ఆకలి లేకుండా ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణాశయం నుంచి మెదడుకు ఆకలి సంకేతాలు వెళ్లవు. దీనివల్ల జీర్ణరసాలు విడుదల కావు. అటువంటప్పుడు అజీర్ణ సమస్యలు ఏర్పడవచ్చు. అదే నిర్ణీత వేళలకు తీసుకునే అలవాటు కారణంగా కడుపు నుంచి ఆకలి సంకేతాలు మెదడుకు ఆటోమేటిగ్గా వెళతాయి. దీంతో జీర్ణ రసాలు విడుదల అవుతాయి. 

భావోద్వేగాలను అధిగమించేందుకు..
భావోద్వేగానికి గురైనప్పుడు ఏదో ఒకటి తినడం కొందరు చేసే పని. ఈ సమయంలో ప్రతికూలతల నుంచి బయటకు వచ్చేందుకు ఆహారంపై దృష్టి మళ్లిస్తుంటారు. ఈ సమయంలో ఎంత తింటున్నామన్నది స్పృహ ఉండదు. దీనివల్ల జీర్ణవ్యవస్థపై అదనపు భారం వేసినట్టు అవుతుంది. 

అధికంగా నీరు తీసుకోవడం
కొందరు నీరు ఎక్కువగా తాగుతుంటారు. ఇది మంచిదే. కానీ ఆహారానికి ముందు, ఆహారం తీసుకున్న తర్వాత కొంత వ్యవధి వరకు నీరు తాగకూడదు. కనీసం గంట విరామం అయినా ఇవ్వాలన్నది వైద్యుల సూచన. ఈ విరామం ఇవ్వకపోవడం వల్ల జీర్ణ ప్రక్రియకు అవసరమైన జీర్ణరసాలు నీటి కారణంగా పలుచబడిపోతాయి. దాంతో ఆహారం సరిగ్గా జీర్ణం కాదు.

శరీరతత్వానికి విరుద్ధంగా వద్దు.. 
శరీర తత్వానికి విరుద్ధమైన ఆహారం తీసుకోవడం కూడా జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. కఫ, వాత, పిత్త అనే మూడు రకాల శరీరాలు ఉంటాయి. వీటికి అనుకూలమైన ఆహారాన్నే తీసుకోవాలి.

ఆల్కహాల్
ఆల్కహాల్ తరచూ తీసుకునే వారికి కూడా జీర్ణ సమస్యలు ఏర్పడతాయి. మత్తులో అధికంగా ఆహారం తీసుకుంటూ ఉంటారు. ఆల్కహాల్ తోపాటు, దానికి తోడు తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేసేందుకు లివర్ ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది.

More Telugu News