LPG Cylinder: కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరపై భారీ బాదుడు.. ఏకంగా రూ. 273.50 పెంపు

Hugu hike on commercial cooking gas cylinder
  • హైదరాబాద్‌లో 19 కిలోల సిలిండర్ ధర రూ. 2,460
  • దేశ రాజధాని ఢిల్లీలో రూ. 2,253కి పెరిగిన ధర
  • గృహ వినియోగదారులకు ఊరట

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర అసాధారణంగా పెరిగింది. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరపై ఏకంగా రూ. 273.50 పెంచుతున్నట్టు చమురు సంస్థలు ప్రకటించాయి. ఫలితంగా హైదరాబాద్‌లో ఈ సిలిండర్ ధర రూ. 2,186 నుంచి రూ. 2,460కి పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో ఇదే సిలిండర్ ధర రూ. 2,253కి ఎగబాకింది. గత రెండు నెలల్లో ఈ సిలిండర్ ధరపై ఏకంగా రూ. 346 పెరిగింది. 

మార్చి 1న రూ. 105 పెంచిన కంపెనీలు, 22న రూ. 9 పెంచాయి. ఈసారి ఏకంగా రూ. 273.50 బాదేశాయి. అయితే గృహ వినియోగదారులకు మాత్రం చమురు కంపెనీలు ఊరటనిచ్చాయి. 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధరను మాత్రం ముట్టుకోలేదు. ఫలితంగా దాని ధర రూ. 1002 వద్ద నిలకడగా ఉంది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో నిలకడగా ఉన్న పెట్రో, గ్యాస్ ధరలు ఆ తర్వాత మాత్రం ప్రతి రోజూ పెరుగుతూనే ఉన్నాయి.

  • Loading...

More Telugu News