Russia: ఉక్రెయిన్‌లో ఇంకా 50 మంది వరకు భారతీయులు: కేంద్రం

50 Indians still in Ukraine Centre in Rajya Sabha
  • ఉక్రెయిన్ నుంచి 22,500 మంది భారతీయుల తరలింపు
  • ఇంకా అక్కడున్న వారిలో కొద్దిమందే వచ్చేందుకు సుముఖత
  • రాజ్యసభలో వెల్లడించిన మంత్రి మీనాక్షి లేఖి
రష్యా దురాక్రమణ కారణంగా ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన వేలాదిమంది భారతీయులను ప్రభుత్వం స్వదేశానికి తరలించింది. ప్రత్యేక విమానాల ద్వారా గత నెలలో మొత్తంగా 22,500 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. అయితే, ఇంకా అక్కడ 40 నుంచి 50 మంది భారతీయులు ఉన్నట్టు విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి మీనాక్షిలేఖి తెలిపారు. 

రాజ్యసభలో బీజేపీ సభ్యుడు ప్రకాశ్ జవదేకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మాట్లాడుతూ ఆమె ఈ విషయాన్నివెల్లడించారు. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో ఉన్న వారిలో కొందరు మాత్రమే భారత్‌కు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. వందేభారత్ మిషన్, ఎయిర్ బబుల్ ద్వారా కరోనా సమయంలో 2.97 కోట్ల మంది సురక్షితంగా రాకపోకలు సాగించినట్టు మంత్రి తెలిపారు.
Russia
Ukraine
Indians
Meenakshi Lekhi

More Telugu News