ఐపీఎల్ లో నేడు చెన్నై వర్సెస్ లక్నో... ఊతప్ప దూకుడు
- ఆసక్తికరంగా సాగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లు
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో జట్టు
- వేగంగా ఆడుతున్న ఊతప్ప
బ్యాటింగ్ కు దిగిన చెన్నై జట్టుకు ఓపెనర్ రాబిన్ ఊతప్ప దూకుడైన ఆరంభం అందించాడు. అవేష్ ఖాన్ విసిరిన తొలి ఓవర్లో 2 ఫోర్లు కొట్టాడు. మరుసటి ఓవర్లో ఓ భారీ సిక్స్, ఫోర్ బాదాడు. ప్రస్తుతం 2 ఓవర్లు ముగిసేసరికి చెన్నై వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. రాబిన్ ఊతప్ప (20 నాటౌట్), రుతురాజ్ గైక్వాడ్ (1 నాటౌట్) ఉన్నారు.