Vijayasai Reddy: తాళ్లపూడి నుంచి పార్లమెంటు వరకు... తన ప్రస్థానంపై విజయసాయిరెడ్డి ఆసక్తికర ట్వీట్

Vijayasai Reddy tweets in his Rajyasabha tenure
  • త్వరలో ముగియనున్న విజయసాయి రాజ్యసభ పదవీకాలం
  • తాళ్లపూడిలో జన్మించానని వెల్లడి
  • పార్లమెంటుకు వెళతానని అనుకోలేదని వివరణ
  • భారత్ అద్భుతమైన దేశమని కితాబు
వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా విజయసాయిరెడ్డి పదవీకాలం త్వరలో ముగియనుంది. దీనిపై ఆయన ట్విట్టర్ లో స్పందించారు. 

"భారతదేశం అద్భుతమైన దేశం. నేను నెల్లూరు జిల్లా తాళ్లపూడిలో పుట్టాను. చెన్నైలో అకౌంటెన్సీ ప్రాక్టీసు చేశాను. అయితే, పార్లమెంటు సభ్యుడిని అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. గడచిన ఆరేళ్ల కాలం నాకు, నా పార్టీకి ఎన్నో జ్ఞాపకాలు మిగిల్చింది. 2016లో రాజ్యసభలో వైసీపీకి నేనొక్కడినే సభ్యుడ్ని. అక్కడ్నించి ఆరుగురం అయ్యాం. త్వరలోనే ఆ బలం 9 మందికి పెరగనుంది. ఈ క్రమంలో ఎంతో సుదీర్ఘ ప్రయాణం చేశాం" అంటూ విజయసాయి వివరించారు. 

కాగా, జూన్ 25తో విజయసాయి రాజ్యసభ పదవీకాలం ముగియనుంది. త్వరలో ఏపీ మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్న నేపథ్యంలో, విజయసాయిని క్యాబినెట్ లో చేర్చుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై ఓ పత్రికలో కథనం కూడా వచ్చింది.
Vijayasai Reddy
Rajya Sabha
Tenure
YSRCP
Andhra Pradesh

More Telugu News