తిరుమల కొండపై ద్విచక్రవాహనదారులను వెంటాడిన ఏనుగులు
- నాలుగు రోజులుగా పాపవినాశంలో తిష్ఠ వేసిన ఏనుగులు
- ఆకాశగంగ ప్రాంతంలో ద్విచక్రవాహనదారులపై
- భయంతో బెంబేలెత్తిపోయిన బైకర్లు
ఇటీవలి కాలంలో చిత్తూరు జిల్లాలో ఏనుగుల దాడులు ఎక్కువవుతున్నాయి. ఈ మధ్యనే జోగివారిపల్లె గ్రామంలో ఓ రైతును ఏనుగుల మంద చంపేసింది. పొలాలను ఏనుగులు నాశనం చేస్తుండటంతో రైతులు రాత్రి వేళల్లో పొలాల్లో కాపలా కాస్తున్నారు. ఈ క్రమంలో రాత్రిపూట పొలంలో నిద్రిస్తున్న ఎల్లప్ప అనే రైతుపై ఏనుగులు దాడి చేశాయి. దాడిలో గాయపడిన ఎల్లప్ప ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ప్రాంతంలో గత కొన్ని రోజులుగా ఏనుగులు పంటను నాశనం చేయడమే కాకుండా... పొలాల్లోని మోటార్లు, పాకలను కూడా నాశనం చేస్తున్నాయి.