India: భారత్ లో తగ్గుముఖం పడుతున్న కరోనా తీవ్రత.. అప్డేట్స్ ఇవిగో!

India records 1225 new corona cases
ఇండియాలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,225 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 1,594 మంది కరోనా నుంచి కోలుకోగా... 28 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు 5,21,129 మంది కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం దేశంలో 14,307 యాక్టివ్ కేసులు ఉన్నాయి. క్రియాశీల రేటు 0.03కి తగ్గింది. ఇప్పటి వరకు 4,24,89,004 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో రికవరీ రేటు 98.76కి పెరిగింది. ఇప్పటి వరకు 1,84,06,55,005 డోసుల వ్యాక్సిన్ వేశారు. నిన్న ఒక్కరోజే 22,27,307 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.
India
Corona Virus
Update

More Telugu News