Aditya Mittal: హైద‌రాబాద్‌లో జూనియ‌ర్‌ మిట్ట‌ల్‌.. కేటీఆర్‌తో భేటీ

ktr meets Arcelor Mittal ceoin hyderabad
  • ఇటీవ‌లే ఆర్సెల‌ర్ మిట్ట‌ల్ సీఈఓగా ఆదిత్య‌
  • ఆదిత్య‌ను క‌లిసిన కేటీఆర్‌
  • తెలంగాణ‌లో పెట్టుబ‌డుల‌పై చ‌ర్చించాన‌ని వెల్ల‌డి
ఒక‌ప్పుడు మిట్ట‌ల్ స్టీల్స్‌గా విశ్వ‌విఖ్యాతి పొందిన ఆర్సెల‌ర్ మిట్ట‌ల్ కంపెనీ సీఈఓ ఆదిత్య మిట్ట‌ల్ హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు. మిట్ట‌ల్ స్టీల్స్ వ్య‌వ‌స్థాప‌కుడు ల‌క్ష్మీ మిట్ట‌ల్ కుమారుడైన ఆదిత్య ఇటీవ‌లే ఆర్సెల‌ర్ మిట్ట‌ల్ కంపెనీ సీఈఓగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించిన సంగ‌తి తెలిసిందే. 

హైద‌రాబాద్ వ‌చ్చిన ఆదిత్య మిట్ట‌ల్‌తో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ విషయాన్ని స్వ‌యంగా కేటీఆరే త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో వెల్ల‌డించారు. హైద‌ర‌బాద్ అల్లుడు కూడా అయిన ఆదిత్య మిట్ట‌ల్‌తో భేటీ అయ్యాన‌ని, తెలంగాణ‌లో ఆర్సెల‌ర్ మిట్ట‌ల్ కంపెనీ పెట్టుబ‌డుల గురించి చ‌ర్చించాన‌ని కేటీఆర్ స‌ద‌రు ట్వీట్‌లో వెల్ల‌డించారు.
Aditya Mittal
Arcelor Mittal
KTR
Hyderabad

More Telugu News