TDP: చంద్ర‌బాబు యువ మంత్రం.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో యువ‌త‌కు 40 శాతం సీట్లు

chandrababu announces 40 seats to youth leaders in next elections
  • పార్టీ 40 వసంతాల వేడుక‌లో చంద్ర‌బాబు కీల‌క ప్ర‌క‌ట‌న‌
  • యువ‌త ముందుకు వ‌చ్చి పోరాడాల‌ని పిలుపు
  • స‌మాజ హితం కోరే వారు రాజ‌కీయాల్లోకి రావాల‌ని సూచ‌న‌
టీడీపీ 40 వసంతాల వేడుక‌ల సంద‌ర్భంగా ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబునాయుడు కీల‌క ప్ర‌కట‌న చేశారు. హైద‌రాబాద్‌లోని ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్ వేదికగా జ‌రుగుతున్న వేడుక‌ల్లో భాగంగా ప్ర‌సంగించిన చంద్ర‌బాబు యువ మంత్రాన్ని ప‌ఠించారు. వచ్చే ఎన్నిక‌ల్లో పార్టీ త‌ర‌ఫున 40 శాతం సీట్ల‌ను యువ‌త‌కే కేటాయించ‌నున్న‌ట్లుగా చంద్ర‌బాబు కీల‌క ప్ర‌కట‌న చేశారు. 

యువ‌త‌ను ప్రోత్స‌హించాల‌ని పార్టీ నిర్ణ‌యం తీసుకుంద‌న్న చంద్ర‌బాబు..పార్టీ కోసం యువ‌త ముందుకు వ‌చ్చి పోరాడాల‌ని పిలుపునిచ్చారు. శ‌క్తి సామ‌ర్థ్యాలు ఉన్న వారు రాజ‌కీయాల్లోకి రావాల‌ని పిలుపునిచ్చిన చంద్ర‌బాబు.. స‌మాజ హితం కోరే వారు రాజ‌కీయాల్లోకి రావాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను నొక్కి చెప్పారు. సంప‌ద‌ను సృష్టించ‌డంలో టీడీపీ ముందుంద‌ని చెప్పిన చంద్ర‌బాబు..రాష్ట్ర పున‌ర్నిర్మాణంలో ప్ర‌జ‌లు భాగ‌స్వామ్యం కావాల‌ని పిలుపునిచ్చారు.
TDP
TDP Formation Day
Chandrababu
NTR Trust Bhavan

More Telugu News