Umesh Chandra IPS: ఉమేశ్ చంద్ర‌కు స‌జ్జ‌నార్ నివాళి

vc sajjannar tributes to umesh chandra
  • మార్చి 29న ఉమేశ్ చంద్ర జ‌యంతి
  • ఉమేశ్ నిలువెత్తు చిత్ర‌ప‌టానికి స‌జ్జ‌నార్ నివాళి
  • ఉమేశ్ చంద్ర నిబ‌ద్ధ‌త‌ను కొనియాడుతూ ట్వీట్‌
దివంగ‌త ఐపీఎస్ అధికారి ఉమేశ్ చంద్రకు తెలంగాణ కేడ‌ర్ సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి, తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్ట‌ర్ వీసీ స‌జ్జ‌నార్ మంగ‌ళ‌వారం నివాళి అర్పించారు. మార్చి 29న ఉమేశ్ చంద్ర జ‌యంతిని పుర‌స్క‌రించుకుని ఉమేశ్ చంద్ర నిలువెత్తు చిత్ర ప‌టం ముందు స‌జ్జ‌నార్ నివాళి అర్పించారు.

ఉమ్మ‌డి రాష్ట్రంలో నిబద్ధ‌త క‌లిగిన ఐపీఎస్ అధికారిగా పేరు తెచ్చుకున్న ఉమేశ్ చంద్ర‌.. మావోయిస్టులపై ఉక్కు పాదం మోపారు. ఈ క్ర‌మంలో ఆయ‌న‌ను టార్గెట్ చేసిన మావోయిస్టులు హైద‌రాబాద్ న‌డిబొడ్డున ప‌ట్ట ప‌గ‌లు ఉమేశ్ చంద్ర‌ను కాల్చిచంపిన సంగ‌తి తెలిసిందే.
Umesh Chandra IPS
VC Sajjannar IPS
TSRTC MD

More Telugu News