ఏపీలో ఠారెత్తిస్తున్న ఎండలు... కర్నూలులో అత్యధికంగా 43.5 డిగ్రీల నమోదు

Temperatures rises in AP
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో వేసవి తీవ్రత హెచ్చుతోంది. పగటి ఉష్ణోగత్రల్లో భారీగా పెరుగుదల కనిపిస్తోంది. అనేక చోట్ల 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్చి నెలాఖరులో సాధారణం కంటే 4 డిగ్రీలు అధికమని వాతావరణ విభాగం పేర్కొంది. రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలులో 43.5 డిగ్రీల వేడిమి నమోదైంది.

ఇతర ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు...

అనంతపురం- 41.6 డిగ్రీలు
చిత్తూరు- 41.55
జమ్మలమడుగు- 41.4
కనిగిరి- 41.2
తిరుపతి- 40.2
నెల్లూరు- 39.7
విజయవాడ- 39.2
గుంటూరు- 37.4
విజయనగరం-36.9
ఒంగోలు- 36.8
ఏలూరు- 36.5
కాకినాడ- 34
విశాఖపట్నం- 33.9


Go Back to Shorts
Temperatures
Andhra Pradesh
Kurnool
Weather

More Telugu News