Sunrisers Hyderabad: తొలి పోరుకు సిద్ధమైన సన్ రైజర్స్... టాస్ గెలిచిన విలియమ్సన్

Sunrisers set takes on Rajasthan Royals in campaigner opener
  • ఐపీఎల్ లో ఆసక్తికర సమరం
  • పూణేలో జరుగుతున్న మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్
  • హేమాహేమీలతో ఉన్న రాజస్థాన్ జట్టు
ఐపీఎల్ తాజా సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్ కు సిద్ధమైంది. రాజస్థాన్ రాయల్స్ తో పూణేలో జరిగే ఈ పోరులో విజయం సాధించాలని కృతనిశ్చయంతో ఉంది. టాస్ గెలిచిన సన్ రైజర్స్ సారథి కేన్ విలియమ్సన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. 

వేలంలో పలువురు టీ20 స్పెషలిస్టులను కొనుగోలు చేసిన ఈ రెండు జట్లలో రాజస్థాన్ జట్టే కాస్తంత బలంగా కనిపిస్తోంది. ఆ జట్టులో జోస్ బట్లర్, కెప్టెన్ సంజు శాంసన్, దేవదత్ పడిక్కల్, హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, చహల్, ట్రెంట్ బౌల్ట్ వంటి హేమాహేమీలున్నారు.

హైదరాబాద్ జట్టులో విలియమ్సన్, నికోలాస్ పూరన్, భువనేశ్వర్, వాషింగ్టన్ సుందర్, మార్ క్రమ్ వంటి కీలక ఆటగాళ్లు ఉన్నప్పటికీ అందరూ సమష్టిగా రాణిస్తేనే గెలుపు సాధ్యమవుతుంది. వేలంలో కోట్లు పోసి కొనుగోలు చేసిన వెస్టిండీస్ ఆటగాడు రొమారియా షెపర్డ్ పై అందరి దృష్టి ఉండనుంది. బౌలింగ్, బ్యాటింగ్ రెండు రంగాల్లో ఉపయోగపడతాడని అతడిని సన్ రైజర్స్ కొనుగోలు చేసింది.
Sunrisers Hyderabad
Rajasthan Royals
Toss
Pune
IPL

More Telugu News