Mithali Raj: మ‌హిళా క్రికెట్‌లో టాప్ 10 ర్యాంకుల్లో ముగ్గురు మ‌నోళ్లే!

team inda women players got best ranks
  • ప్రపంచ క‌ప్ నుంచి వెనుదిరిగిన భార‌త్‌
  • అయినా స‌త్తా చాటిన జ‌ట్టు స‌భ్యులు
  • బ్యాటింగ్‌లో ఆరోస్థానంలో మిథాలీ, ప‌దో స్థానంలో స్మృతి
  • బౌలింగ్‌లో ఐదో స్థానంలో ఝుల‌న్ గోస్వామి
మ‌హిళ‌ల ప్ర‌పంచ క‌ప్‌లో టీమిండియా ఇంటి బాట ప‌ట్టినా.. మ‌న జ‌ట్టుకు చెందిన ముగ్గురు కీల‌క ఆట‌గాళ్లు ఉత్త‌మ ర్యాంకుల్లో నిలిచారు. టీమిండియా మ‌హిళా క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ ఉత్త‌మ బ్యాట‌ర్ల జాబితాలో ఆరో స్థానంలో నిలవ‌గా.. మ‌రో స్టార్ ప్లేయ‌ర్ స్మృతి మంథాన ప‌దో స్థానంలో కొన‌సాగుతోంది. ఇక బౌలింగ్ విభాగంలో భార‌త బౌల‌ర్ ఝుల‌న్ గోస్వామి ఐదో ర్యాంకులో నిలిచింది.

ప్ర‌పంచ క‌ప్ నుంచి భార‌త జ‌ట్టు వెనుదిరిగినా... జ‌ట్టు స‌భ్యులు స‌త్తా చాటారు. ఈ మ్యాచ్‌లలో రెండు సెంచ‌రీలు న‌మోదు చేసిన మిథాలీ త‌న ర్యాంకును మెరుగుప‌ర‌చుకుని టాప్ 10లోకి దూసుకువ‌చ్చింది. ఇక నిల‌క‌డ ప్ర‌ద‌ర్శ‌న‌తో రాణించిన స్మృతి త‌న ప‌దో స్థానాన్ని నిల‌బెట్టుకుంది. బౌలింగ్‌లో స‌త్తా చాటిన ఝుల‌న్ రెండు స్థానాలు మెరుగుప‌ర‌చుకుని ఐదో స్థానానికి ఎగ‌బాకింది.
Mithali Raj
Smriti Mandanna
Jhulan goswami
ICC

More Telugu News