Nandamuri Balakrishna: ఎన్టీఆర్ కు మనం అందించే నివాళి అదే: బాలకృష్ణ

Balakrishna message in TDP Formation Day celebrations
  • టీడీపీ 40 వసంతాల వేడుకలు
  • శుభాకాంక్షలు తెలిపిన బాలకృష్ణ
  • కార్యకర్తలే టీడీపీకి కంచుకోట అని వెల్లడి
  • పోరాటమే మన ఊపిరి అని ఉద్ఘాటన
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నాలుగు దశాబ్దాలైంది. ఉభయ రాష్ట్రాల్లో టీడీపీ 40 వసంతాల వేడుకలు ఘనంగా జరుపుకుంటోంది. ఈ సందర్భంగా టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు తనయుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు. కార్యకర్తలు, అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని, పోరాటమే మన ఊపిరి అని ఉద్ఘాటించారు. ఎన్టీఆర్ కు మనం అందించే నివాళి అదేనని స్పష్టం చేశారు. 

నాలుగు దశాబ్దాలుగా పసుపు జెండా రెపరెపలాడుతోందంటే అందుకు లక్షల మంది కార్యకర్తలు, కోట్లాది ప్రజల ఆశీస్సులే కారణమని తెలిపారు. తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో టీడీపీ కొత్త శకం లిఖించిందని పేర్కొన్నారు. ఆడబిడ్డలకు ఎన్టీఆర్ కల్పించిన ఆస్తిహక్కు దేశానికే దిక్సూచి అయిందని వివరించారు. పేదల సంక్షేమానికి శ్రీకారం చుట్టింది టీడీపీనే అని, ఎత్తిపోతల పథకాలతో రాష్ట్రం అన్నపూర్ణ అయిందంటే అది టీడీపీ ఘనతేనని బాలకృష్ణ పేర్కొన్నారు. 
Nandamuri Balakrishna
TDP
Formation Day
NTR
Andhra Pradesh
Telangana

More Telugu News