Harish Rao: మెడికల్ షాపుల్లో కూడా దళితులకు రిజర్వేషన్లు కల్పిస్తాం: హరీశ్ రావు

Will give reservations to dalits in medical shops also says Harish Rao
  • దళితుల జీవితాల్లో వెలుగులు నింపడమే కేసీఆర్ ఆశయం
  • దళిత బంధు దళితుల అభ్యున్నతి కోసం ప్రారంభించిన ఒక ఉద్యమం
  • వైన్ షాపుల్లో దళితులకు రిజర్వేషన్లు కల్పిచామన్న హరీశ్ 
దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయమని మంత్రి హరీశ్ రావు అన్నారు. దళితబంధు అనేది కేవలం ఒక పథకం కాదని... దళితుల అభ్యున్నతి కోసం ప్రారంభించిన ఒక ఉద్యమమని చెప్పారు. దళితబంధు పథకం ద్వారా కేవలం ఆర్థిక సాయాన్ని అందించడమే కాకుండా, వారి వ్యాపారాభివృద్ధికి అధికారులు అన్ని విధాలుగా సహకరిస్తారని తెలిపారు. వైన్ షాపుల్లో కూడా దళితులకు రిజర్వేషన్ కల్పించామని చెప్పారు. రాబోయే రోజుల్లో మెడికల్ షాపుల్లో కూడా దళితులకు రిజర్వేషన్లు కల్పించబోతున్నామని తెలిపారు.
Harish Rao
KCR
TRS
Dalit Bandhu

More Telugu News