Chandrababu: హైదరాబాదులో 'నేను-తెలుగుదేశం' పుస్తకాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు

Chandrabau launches Nenu Telugudesam book
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్ రావు రచించిన 'నేను-తెలుగుదేశం' అనే పుస్తకావిష్కరణ కార్యక్రమం ఈ సాయంత్రం హైదరాబాదులో జరిగింది. 40 ఏళ్ల తెలుగుదేశం పార్టీ ప్రస్థానాన్ని ఈ పుస్తకంలో వివరించారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. 

కాగా, తన పుస్తకంపై కంభంపాటి రామ్మోహన్ రావు స్పందిస్తూ... ఈ పుస్తకం కోసం రెండేళ్లు హోమ్ వర్క్ చేశానని వెల్లడించారు. 'ఎన్టీఆర్ ఏది చెబితే అది చేయడమే నాకు తెలుసు' అని వివరించారు. అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అని కొనియాడారు. కాగా, ఈ పుస్తకావిష్కరణ సభలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, టీడీపీ సీనియర్ నేతలు అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.
Go Back to Shorts
Chandrababu
Nenu Telugudesam
Book
Kambhampati Rammohan Rao
Hyderabad
TDP

More Telugu News