Youth: నెత్తిమీద గడ్డిమోపుతో.. హ్యాండిల్ పట్టుకోకుండా సైకిల్ పై దూసుకెళ్లిన పల్లెటూరి కుర్రాడు... వీడియో వైరల్

  • ఆశ్చర్యం కలిగించే వీడియోలకు నెలవుగా సోషల్ మీడియా
  • కొత్తదనం ఉన్న వీడియోలకు నెటిజన్ల బ్రహ్మరథం
  • సైకిల్ పై చేతులు వదిలేసి ఓ పల్లెటూరి కుర్రాడి నైపుణ్యం
Youth carries grass on his head races on cycle

ఇది సోషల్ మీడియా యుగం. ఎక్కడ కొత్తదనం కనిపించినా, ఎక్కడ వింతలు, విడ్డూరాలు చోటుచేసుకున్నా నిమిషాల్లో ప్రపంచమంతా పాకిపోతుంది. చూడగానే ఔరా అనిపించేలా ఉండాలంతే... అది ఏ ప్రాంతం, ఏ భాష అనేది నెటిజన్లకు అవసరంలేదు. అత్యధికులకు నచ్చిన వీడియో కొద్దిసేపట్లోనే వైరల్ అవుతుంది. ఈ వీడియో కూడా అలాంటిదే. 

ఓ గ్రామీణ ప్రాంతంలో చిత్రీకరించిన వీడియో. ఓ కుర్రాడు నెత్తిమీద గడ్డిమోపు పెట్టుకుని, దాన్ని చేతులతో పట్టుకుని సైకిల్ తొక్కుకుంటూ వెళ్లడం ఈ వీడియోలో చూడొచ్చు. ఆ కుర్రాడు సైకిల్ హ్యాండిల్ ను చేతులతో పట్టుకోకపోయినా, ఎంతో నేర్పుగా బ్యాలెన్స్ చేసుకుంటూ తారు రోడ్డుపై రివ్వున దూసుకెళ్లాడు. అతడి వెనుకగా వస్తున్న ఓ వాహనంలోని వారు దీన్ని తమ ఫోన్లో వీడియోగా చిత్రీకరించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ గడ్డిమోపు-సైకిల్ వీడియో సందడి చేస్తోంది.

More Telugu News