పవన్ 'వీరమల్లు' కోసం భారీ సెట్టింగులు... ఒకదాన్ని మించిపోయేలా మరొకటి!
- క్రిష్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్
- హరిహర వీరమల్లు కోసం భారీతనం ఉట్టిపడే సెట్టింగులు
- ప్రాచీన భారతదేశాన్ని చూపించనున్న క్రిష్
- హైదరాబాదులో తోట తరణి ఆధ్వర్యంలో సెట్టింగులు
వీరమల్లు కోసం అప్పటి కాలాన్ని ప్రతిబింబించేలా అద్భుతమైన సెట్టింగ్స్ కు రూపకల్పన చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాదులో సీనియర్ ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి పర్యవేక్షణలో ఈ సెట్టింగ్స్ సిద్ధం చేయిస్తున్నారు. ఈ సెట్టింగ్స్ ఒకదాన్ని మించిపోయేలా మరొకటి ఉంటాయని టాక్ వినిపిస్తోంది. పవన్ చిత్రంలో ప్రాచీన భారతదేశాన్ని ఆవిష్కరించేందుకు క్రిష్ ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నారు.
కాగా, ఈ చిత్రంలో పవన్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన హరిహర వీరమల్లు స్టిల్స్, గ్లింప్స్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి.