Komatireddy Venkat Reddy: న‌న్ను పిల‌వ‌లేదు.. దేవుడి దగ్గర కేసీఆర్ బహునీచపు రాజకీయాలు: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

komati reddy slams kcr
  • యాదాద్రి పునఃప్రారంభం విష‌యంలో సీఎంవో ప్రొటోకాల్ పాటించలేదు
  • కేవలం అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను మాత్రం ఆహ్వానించింది
  • ఇలాంటి రాజకీయాలు చేయడం బాధాకరమన్న వెంకట్ రెడ్డి 
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి స్వయంభూ దర్శన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వైభ‌వంగా నిర్వ‌హిస్తోన్న విష‌యం తెలిసిందే. తెలంగాణ సీఎం కేసీఆర్ దంప‌తుల‌తో పాటు రాష్ట్ర‌ మంత్రులు ప‌లువురు ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. అయితే, స్థానిక ఎంపీగా ఉన్న త‌న‌ను ఈ కార్య‌క్ర‌మానికి పిల‌వ‌క‌పోవ‌డంతో కాంగ్రెస్ నేత‌ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.
 
'యాదాద్రి పునఃప్రారంభం విష‌యంలో తెలంగాణ సీఎంవో ప్రొటోకాల్ పాటించలేదు. స్థానిక ఎంపీగా వున్న నన్ను పునఃప్రారంభానికి పిలవలేదు. కేవలం అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను మాత్రం ఆహ్వానించింది. దేవుడి దగ్గర కేసీఆర్ బహునీచపు రాజకీయాలు చేయడం బాధాకరం' అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ట్వీట్ చేశారు.
Komatireddy Venkat Reddy
Congress
Yadadri Bhuvanagiri District
KCR

More Telugu News