కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నుజ్జునుజ్జయిన కారు.. ఐదుగురి మృతి
- మాచారెడ్డి మండలం ఘన్‌పూర్(ఎం) వద్ద ప్రమాదం
- మరొకరికి తీవ్ర గాయాలు
- బస్సు టైరు పేలడం వల్లే యాక్సిడెంట్
ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, ఒక బాలుడు ఉన్నాడు. కారులోని మరో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెకు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. బస్సు టైరు పేలి అదుపు తప్పడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు.