kgf: నేడు రామ్ చ‌ర‌ణ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆయ‌న చేతుల మీదుగా 'కేజీఎఫ్-2' ట్రైల‌ర్

We are Elated to have the Mega Powerstar  to launt trailer
  • ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ రూపొందించిన కేజీఎఫ్ 
  • నేటి సాయంత్రం 6.40 గంట‌లకు విడుద‌ల‌
  • ట్విట్ట‌ర్‌లో ప్ర‌క‌టించిన కేజీఎఫ్ టీమ్

ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ రూపొందించిన 'కేజీఎఫ్-2' సినిమా తెలుగు ట్రైల‌ర్ నేడు రామ్ చ‌రణ్ చేతుల మీదుగా విడుద‌ల కానుంది. ఈ రోజు రామ్ చ‌ర‌ణ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా సాయంత్రం 6.40 గంట‌లకు ఆయ‌నతోనే 'కేజీఎఫ్-2' ట్రైల‌ర్ విడుద‌ల చేయిస్తున్న‌ట్లు ఆ సినిమా యూనిట్ ప్ర‌క‌టించింది. 

                       
'ఆర్ఆర్ఆర్' సినిమాతో రామ్ చ‌ర‌ణ్‌కు దేశ వ్యాప్తంగా పేరు వ‌చ్చింది. ఆ సినిమా భారీ వ‌సూళ్ల‌తో దూసుకుపోతోంది. దీంతో చెర్రీతోనే త‌మ సినిమా ట్రైల‌ర్ విడుద‌ల చేయించాల‌ని 'కేజీఎఫ్-2' యూనిట్ నిర్ణ‌యించింది. కాగా, ఈ సినిమా త‌మిళ ట్రైల‌ర్ కూడా ఈ రోజు సాయంత్రం 6.40 గంట‌ల‌కే హీరో సూర్య చేతుల మీదుగా విడుద‌ల కానుంది.

  • Loading...

More Telugu News