Johnny Master: జానీ మాస్టర్‌ కి ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చిన కిచ్చా సుదీప్

Kicha Sudeep gifs car to Johnny Master
  • రూ. 15 లక్షల విలువైన థార్ కారును బహుమతిగా ఇచ్చిన సుదీప్
  • 'విక్రాంత్ రోణా' చిత్రంలో ఓ పాటకు కొరియోగ్రఫీ అందించిన జానీ మాస్టర్
  • ఈ పాటలో సుదీప్ తో కలిసి చిందేసిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఖరీదైన కారును గిఫ్ట్ గా ఇచ్చారు. దాదాపు రూ. 15 లక్షల విలువైన థార్ కారును బహుమతిగా అందించారు. ఈ సందర్భంగా సుదీప్ తో కలిసి జానీ మాస్టర్ కొత్త కారు ముందు నిలిచి ఫొటోలు దిగారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సుదీప్ హీరోగా నటించిన 'విక్రాంత్ రోణా' చిత్రంలో ఓ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఈ పాటలో బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సుదీప్ తో కలిసి స్టెప్పులు వేసింది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Johnny Master
Kicha Sudeep
Gift
Car

More Telugu News