భారతీయ సినీ చరిత్రలో 'ఆర్ఆర్ఆర్' సంచలన రికార్డు... తొలిరోజు వసూళ్లు సునామీనే!
- బాహుబలి-2 రికార్డును అధిగమించిన ఆర్ఆర్ఆర్
- నిన్న విడుదలైన ఆర్ఆర్ఆర్
- వరల్డ్ వైడ్ రూ.223 కోట్ల గ్రాస్ వసూలు
- భారత్ లోనే రూ.156 కోట్ల కలెక్షన్స్
తరణ్ ఆదర్శ్ ట్వీట్ ప్రకారం.... ఆర్ఆర్ఆర్ చిత్రం బాహుబలి-2 ఓపెనింగ్ రికార్డును తిరగరాసింది. తద్వారా భారతీయ సినీ చరిత్రలో అత్యధికంగా ఓపెనింగ్స్ కొల్లగొట్టిన చిత్రంగా రికార్డు నమోదు చేసింది. ఆర్ఆర్ఆర్ చిత్రం వరల్డ్ వైడ్ తొలిరోజున రూ.223 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. భారత్ లో అత్యధికంగా రూ.156 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా, ఒక్క అమెరికాలోనే రూ.42 కోట్లు రాబట్టింది. అమెరికా కాకుండా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి ఇతర దేశాల్లోనూ మరో రూ.25 కోట్లు వసూలు చేయడం విశేషం.
భారత్ లో ఈ సినిమా ఓపెనింగ్స్ చూస్తే... ఏపీలో రూ.75 కోట్లు, నైజామ్ లో రూ.27.5 కోట్లు, ఉత్తరాది రాష్ట్రాల్లో రూ.25 కోట్లు, కర్ణాటకలో రూ.14.5 కోట్లు, తమిళనాడులో రూ.10 కోట్లు, కేరళలో రూ.4 కోట్లు వసూలు చేసింది.