ఒకే ఫ్రేమ్‌లో ఆ ఐదుగురు!.. ఫొటో తీసిందెవరంటే..!
- యోగి ప్రమాణానికి బీజేపీ కీలక నేతలు
- ఐదుగురు కీలక నేతలున్న ఫొటోను తీసిన స్మృతి ఇరానీ
- పొద్దున్నే పేపర్లలో ఏఎన్ఐ ఫొటోగా ప్రచురితం
- తాను ఫొటో తీస్తే.. క్రెడిట్ ఏఎన్ఐకి వెళ్లిందన్న మంత్రి
వివిధ ప్రాంతాల నుంచి తొలి తరం నేతలుగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఈ ఐదుగురిలో మోదీ మినహా మిగిలిన నలుగురూ బీజేపీ జాతీయ అధ్యక్షులుగా పనిచేసిన వారే. వారిలో జేపీ నడ్డా ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇదే అంశాన్ని తెలియజేస్తూ శనివారం నాటి సంచికల్లో పలు పత్రికలు ఈ ఫొటోను హైలైట్ చేస్తూ కథనాలు రాశాయి. అయితే ఆ ఫొటోను మాత్రం ఏఎన్ఐ తీసినట్లుగా ఆయా పత్రికలు పేర్కొన్నాయి.
యోగి ప్రమాణ స్వీకారంలో బిజీగా ఉన్నా.. ఈ ఆసక్తికరమైన దృశ్యాన్ని తన మొబైల్‌లో చిత్రీకరించిన స్మృతి ఇరానీ.. ఆ తర్వాత దానిని అంతగా పట్టించుకోలేదు. అయితే తీరా శనివారం ఉదయం పత్రికలు చూసిన స్మృతి ఈ ఫొటో కింద సోర్స్‌ను చూసి షాక్ తిన్నారట. అరెరే.. ఫొటో నేను తీస్తే క్రెడిట్ ఏఎన్ఐ ఖాతాలో పడిపోయిందే ఆని ఆమె బాధపడ్డారు. ఇదే విషయాన్ని ఆమె తన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు.