ఎలక్ట్రిక్ స్కూటర్ పేలి తండ్రి, కూతురు దుర్మరణం
- తమిళనాడు వేలూరు జిల్లాలో ఘటన
- రెండు రోజుల క్రితమే ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్న దురై వర్మ
- ఓవర్ ఛార్జింగ్ కారణంగా పేలిన స్కూటర్
శుక్రవారం రాత్రి స్కూటర్ కు ఛార్జింగ్ పెట్టి తండ్రి, కూతురు నిద్రిస్తుండగా... ఓవర్ ఛార్జింగ్ కారణంగా స్కూటర్ పేలిపోయింది. మరో బైకుకు మంటలు అంటుకున్నాయి. పేలుడు ధాటికి పొగలు పెద్దగా కమ్ముకున్నాయి. బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో ఇంట్లోని బాత్ రూమ్ లో వారిద్దరూ దాక్కున్నారు. చివరకు ఊపిరి ఆడక ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.