Nakka Anand Babu: న్యాయస్థానం వల్లే జగన్ సీఎంగా ఉన్నారు... అవహేళన చేయడం తగదు: నక్కా ఆనంద్ బాబు

Nakka Anand Babu reacts to CM Jagan comments on judiciary system
షార్ట్స్‌లో చూడండి
ఏపీ రాజధాని విషయంలో కోర్టు తీర్పులపై సీఎం జగన్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు తప్పుబట్టారు. తప్పులు ఎత్తిచూపిన న్యాయస్థానాలపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? అంటూ విమర్శించారు. అసలు, న్యాయస్థానం బెయిల్ ఇవ్వడం వల్లే జగన్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారని పేర్కొన్నారు. 

అలాంటి న్యాయస్థానాలను అవహేళన చేస్తూ మాట్లాడడం తగదని నక్కా ఆనంద్ బాబు హితవు పలికారు. అసెంబ్లీలో న్యాయవ్యవస్థ ఔన్నత్యాన్ని చులకన చేసేలా జగన్ మాట్లాడారని ఆరోపించారు. జగన్ తన వ్యాఖ్యల ద్వారా అంబేద్కర్ లిఖించిన రాజ్యాంగాన్ని కించపరిచారని విమర్శించారు.
Go Back to Shorts
Nakka Anand Babu
CM Jagan
Judiciary System
Assembly
Andhra Pradesh

More Telugu News