Akhilesh Yadav: అది మేము కట్టించిన స్టేడియమే: యోగి ప్రమాణస్వీకారంపై అఖిలేశ్ యాదవ్ చురక

Akhilesh Yadav comments On Yogi Adityanath Oath Ceremony
  • నిన్న ప్రమాణస్వీకారం చేసిన యోగి ఆదిత్యనాథ్
  • అటల్ బిహారీ వాజ్ పేయి ఎకానా స్టేడియంలో ప్రమాణస్వీకారం
  • ప్రమాణస్వీకారం కేవలం ప్రభుత్వ ఏర్పాటు కోసం మాత్రమే కాదన్న అఖిలేశ్
యోగి ఆదిత్యనాథ్ యూపీ ముఖ్యమంత్రిగా నిన్న ప్రమాణస్వీకారం చేశారు. లక్నోలోని అటల్ బిహారీ వాజ్ పేయి ఎకానా స్టేడియంలో ఆయన ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ఈ స్టేడియంలో 50 వేల మంది కూర్చునే వీలుంటుంది. మరోవైపు యోగి ప్రమాణస్వీకారంపై సమాజ్ వాది పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ సెటైర్లు వేశారు. 

'గతంలో సమాజ్ వాది పార్టీ ప్రభుత్వం నిర్మించిన స్టేడియంలో ప్రమాణస్వీకారం చేసిన కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు' అంటూ చురక అంటించారు. ప్రమాణస్వీకారం అనేది కేవలం ప్రభుత్వ ఏర్పాటు కోసం మాత్రమే కాకూడదని అన్నారు. ప్రజలకు సేవ చేయడమే ప్రమాణస్వీకార లక్ష్యమని చెప్పారు.
Akhilesh Yadav
Samajwadi Party
Yogi Adityanath
BJP
Oath

More Telugu News