Chiranjeevi: 'ఆర్ఆర్ఆర్' చిత్రం చూశాక మెగాస్టార్ చిరంజీవి స్పందన

Megastar Chiranjeevi opines on RRR movie
  • ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆర్ఆర్ఆర్
  • ట్విట్టర్ లో స్పందించిన చిరంజీవి
  • మాస్టర్ స్టోరీ టెల్లర్ అంటూ రాజమౌళిపై ప్రశంసలు
  • యావత్ చిత్రబృందానికి అభినందనలు
రాజమౌళి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలయికలో వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదల కాగా, ప్రతి సెంటర్లోనూ ప్రభంజనం సృష్టిస్తోంది. అద్భుతమైన కథతో అల్లూరి సీతారామరాజు, కొమురం భీంల స్ఫూర్తిని చాటుతూ రాజమౌళి సృష్టించిన అద్భుత చిత్రకావ్యం అంటూ ఆర్ఆర్ఆర్ పై సర్వత్రా నీరాజనాలు పడుతున్నారు. 

తాజాగా, ఆర్ఆర్ఆర్ చిత్రంపై మెగాస్టార్ చిరంజీవి కూడా తన స్పందన తెలియజేశారు. 'కథలను తెరకెక్కించడంలో మాస్టర్ అనిపించుకున్న వ్యక్తి నుంచి వచ్చిన అద్భుత కళాఖండం ఆర్ఆర్ఆర్' అని కొనియాడారు. సమ్మోహితుల్ని చేసేలా, వెలుగుదివ్వెలా ఉన్న ఈ చిత్రం రాజమౌళి అసమాన సినిమా దార్శనికతకు నిదర్శనం అని అభివర్ణించారు. యావత్ చిత్రబృందానికి హ్యాట్సాఫ్ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
Chiranjeevi
RRR
Rajamouli
NTR
Ramcharan
Tollywood

More Telugu News