Junior NTR: ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: జూనియర్ ఎన్టీఆర్

Thank You each and every one says Junior NTR
  • ఘన విజయం సాధించిన 'ఆర్ఆర్ఆర్' మూవీ
  • మీ ప్రేమకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానన్న తారక్
  • మీ ప్రేమ, ప్రశంసలే ముందుకు నడిపిస్తున్నాయని వ్యాఖ్య
రామ్ చరణ్ తో కలిసి జూనియర్ ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం 'ఆర్ఆర్ఆర్' ఘన విజయం సాధించింది. తనపై ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ పెట్టుకున్న అంచనాలను ఏమాత్రం మిస్ కాకుండా రాజమౌళి అద్భుతంగా చిత్రాన్ని తెరకెక్కించారు. బాలీవుడ్ క్రిటిక్స్ తరణ్ ఆదర్శ్, ఉమైర్ సంధూ వంటి వారు ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు. సినిమా టెర్రిఫిక్ అంటూ ప్రశంసించారు. ఓపెనింగ్ రోజే రూ. 200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేయబోతోందని ఉమైర్ సంధూ అంచనా వేశారు. 

మరోవైపు ఈ సినిమాకు ఇంతటి ఘన విజయాన్ని అందించిన అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ ధన్యవాదాలు తెలిపాడు. మీరు అందిస్తున్న ప్రేమకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెపుతున్నానని ట్వీట్ చేశాడు. మీ ప్రేమ, ప్రశంసలే తనను ముందుకు నడిపిస్తున్నాయని చెప్పాడు. విజువల్ వండర్ 'ఆర్ఆర్ఆర్'ను ఎంజాయ్ చేయండని కోరాడు.
Junior NTR
RRR
Tollywood

More Telugu News