Nara Lokesh: ఈ వారంలో కుటుంబ సమేతంగా ఆర్ఆర్ఆర్ సినిమా చూస్తా: నారా లోకేశ్

Lokesh says he will watch RRR movie with family this week
  • నేడు భారీ స్థాయిలో ఆర్ఆర్ఆర్ రిలీజ్
  • తారక్, చరణ్, రాజమౌళిలకు అభినందనలు చెప్పిన లోకేశ్ 
  • ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని కలిగిస్తున్నారంటూ ట్వీట్
భారీ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాజమౌళి దర్శకత్వ ప్రతిభ పతాకస్థాయిలో ఆవిష్కృతం కాగా, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ పోటాపోటీగా నటనా పటిమ ప్రదర్శించారంటూ రివ్యూలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ చిత్రంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. 

"నేడు విడుదలైన ఆర్ఆర్ఆర్ కు తిరుగులేని రివ్యూలు వస్తున్నట్టు తెలిసింది. ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని అందిస్తున్న తారక్, రామ్ చరణ్, మ్యాస్ట్రో రాజమౌళిని, యావత్ చిత్రబృందాన్ని అభినందిస్తున్నాను. ఈ వారంలో ఆర్ఆర్ఆర్ సినిమాను కుటుంబంతో కలిసి తప్పకుండా చూస్తాను. ఈ సినిమా రికార్డులను బద్దలు కొట్టాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ గైస్!" అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.
Nara Lokesh
RRR
Movie
Rajamouli
NTR
Ramcharan

More Telugu News