మద్రాస్ హైకోర్టు అడిషనల్ జడ్జిగా 'శ్రీశ్రీ' కుమార్తె నిడుమోలు మాలా!
- న్యాయవాదుల కోటాలో ఆరుగురి పేర్లను సిఫారసు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం
- ఇద్దరి పేర్లను ఆమోదించిన రాష్ట్రపతి కోవింద్
- మద్రాస్ లా కాలేజీలో న్యాయశాస్త్రాన్ని అభ్యసించిన మాలా
శ్రీశ్రీ- సరోజ దంపతుల నలుగురు సంతానంలో మాలా చిన్నవారు. మద్రాస్ లా కాలేజీ నుంచి ఆమె న్యాయశాస్త్రంలో డిగ్రీ పొందారు. 1989లో మద్రాస్-పుదుచ్చేరి బార్ అసోసియేషన్ లో నమోదయ్యారు. ఆమె భర్త నిడుమోలు రాధారమణ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉన్నతాధికారిగా పని చేస్తున్నారు. మాలా దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కొడుకు జయప్రకాశ్ మద్రాస్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు.