హైదరాబాద్ ఇరానీ చాయ్ కూడా ప్రియమే.. ఇక కప్పు రూ. 20
- హైదరాబాద్ అనగానే గుర్తొచ్చే ఇరానీ చాయ్
- కప్పు టీ ధర రూ. 15 నుంచి రూ. 20కి పెంపు
- చాయ్ పొడి ధర పెరగడమే కారణమంటున్న హోటళ్ల నిర్వాహకులు
నిత్యావసరాల ధరలు ఎడాపెడా పెరుగుతున్న నేపథ్యంలో ఇరానీ చాయ్ ధరను కూడా రూ. 5 పెంచేశారు. ఫలితంగా ఇప్పటి వరకు రూ. 15గా ఉన్న కప్పు టీ ధర రూ. 20కి చేరింది. ఇరానీ చాయ్‌పొడి ధర కిలో రూ.300 నుంచి రూ. 500కు పెరగడమే ఇందుకు కారణమని హోటళ్ల నిర్వాహకులు చెబుతున్నారు.