ఏపీలో కరోనా రోజువారీ కేసులు 50కి లోపే... తాజా బులెటిన్ విడుదల

AP Corona Bulletin
  • గత 24 గంటల్లో 10,344 కరోనా పరీక్షలు
  • 39 మందికి పాజిటివ్
  • అనంతపురం జిల్లాలో 12 కొత్త కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 45 మంది
  • ఇంకా 444 మందికి చికిత్స
ఏపీలో కరోనా రోజువారీ కేసుల సంఖ్య 50కి లోపే నమోదవుతోంది. గడచిన 24 గంటల్లో 10,344 శాంపిల్స్ పరీక్షించగా, 39 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అనంతపురం జిల్లాలో అత్యధికంగా 12 మందికి కరోనా నిర్ధారణ అయింది. కృష్ణా, కర్నూలు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. 

అదే సమయంలో 45 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడచిన ఒక్కరోజు వ్యవధిలో కొత్తగా కరోనా మరణాలేవీ సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 23,19,367 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 23,04,193 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 444 మంది చికిత్స పొందుతున్నారు. ఏపీలో కరోనాతో ఇప్పటిదాకా 14,730 మంది మృత్యువాతపడ్డారు.
.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Latest Bulletin
Daily Update
Today Cases

More Telugu News