Hummer: వామ్మో... ఎంత పెద్ద వాహనమో... ఒక్కో టైరుకు ఒక్కో ఇంజిన్!

  • హమ్మర్ నుంచి కొత్త మోడల్
  • ప్రత్యేకంగా తయారుచేసిన హమ్మర్ హెచ్1 ఎక్స్ 3
  • సొంతం చేసుకున్న అరబ్ కుబేరుడు
  • కారు ఎక్కాలంటే నిచ్చెన తప్పనిసరి!
Hummer new model spotted in UAE

వాహన ప్రియులకు హమ్మర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇదొక భారీ వాహనం. చూడ్డానికి సైనిక వాహనంలా కనిపిస్తుంది. అది నిజమే... ప్రస్తుత హమ్మర్ కు మాతృక ఓ సైనిక వాహనమే. గతంలో ఏఎమ్ జనరల్ అనే ఆటోమొబైల్ సంస్థ అమెరికా సైన్యం కోసం హమ్వీ వాహనాలు రూపొందించేంది. ఆ హమ్వీని మరింత ఆధునికీకరించి హమ్మర్ కు రూపకల్పన చేశారు. తదనంతర కాలంలో ఏమ్ జనరల్ నుంచి హమ్మర్ బ్రాండ్ ను మరో ఆటోమొబైల్ దిగ్గజం జనరల్ మోటార్స్ సొంతం చేసుకుంది. హమ్మర్ లో హెచ్1, హెచ్2, హెచ్2 మోడళ్లను తీసుకువచ్చింది.

కాగా, సాధారణ హమ్మర్ కంటే భిన్నంగా అత్యంత భారీతనం ఉట్టిపడే జెయింట్ హమ్మర్ ను తయారుచేశారు. దీన్ని హమ్మర్ హెచ్1 ఎక్స్3గా పిలుస్తారు. దీని ఎత్తు 22 అడుగులు అంటే ఆలోచించండి... ఎంత ఎత్తుగా ఉంటుందో! మామూలు హమ్మర్ హెచ్1 కంటే ఇది మూడింతలు పెద్దది. దీంట్లోనే ఓ బెడ్రూం, టాయిలెట్ కూడా ఏర్పాటు చేశారు. దీని పొడవు 14 మీటర్లు కాగా, వెడల్పు 6 మీటర్లు. దీన్ని ఎక్కాలంటే నిచ్చెన కావాల్సిందే!

ఇటీవలే హమ్మర్ హెచ్1 ఎక్స్3 యూఏఈ రోడ్డుపై దర్శనమిచ్చింది. రెయిన్ బో షేక్ (షేక్ హమాద్ బిన్ హమ్దాన్ అల్ నహ్యాన్) అనే ఓ అరబ్ కుబేరుడు దీన్ని సొంతం చేసుకున్నారు. ఈయన వద్ద ప్రపంచంలో ఎవరి వద్ద లేనన్ని ఆల్ వీల్ డ్రైవ్ కార్లు ఉన్నాయి. సాధారణంగా ఏ కారుకైనా ఒకటే ఇంజిన్ ఉంటుంది. కానీ ఈ భారీ హమ్మర్ లో 4 ఇంజిన్లు ఉండడం విశేషం. ఈ ఆల్ వీల్ డ్రైవ్ హమ్మర్ లో ప్రతి టైరుకు ఒక డీజిల్ ఇంజిన్ ఏర్పాటు చేశారు.

More Telugu News