జగన్, సాయిరెడ్డి, రోజా మాస్కులతో విశాఖ మహిళల వినూత్న నిరసన
- వైసీపీ తీరును నిరసిస్తూ విశాఖ మహిళల నిరసన
- ముఖాలకు వైసీపీ నేతల మాస్కులతో స్కిట్
- జగన్‌కు హారతి పడుతూ, పొగడ్తలతో ముంచెత్తుతూ ప్రదర్శన
జగనన్న మద్యం పథకానికి ఇంకెందరి మహిళల తాళిబొట్టు తెగాలి? అన్న క్యాప్షన్‌తో విశాఖ మహిళలు ఈ నిరసన ప్రదర్శనను చేపట్టారు. జంగారెడ్డిగూడెంలో నాటు సారా కారణంగా 25 మంది చనిపోతే జగన్ ప్రభుత్వం ఇప్పటిదాకా స్పందించలేదని, ఈ వ్యవహారంపై జగన్ సర్కారు అసెంబ్లీలో వ్యవహరిస్తున్న తీరు బాగోలేదని ఈ సందర్భంగా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక ధరలకు మద్యం, కల్తీ మద్యం, నాటు సారా వంటి వాటిని తక్షణమే నిర్మూలించాలని మహిళలు డిమాండ్ చేశారు.