Padma Devendar Reddy: ఎగిరిప‌డిన కారు.. సుర‌క్షితంగా బయటపడిన ఎమ్మెల్యే ప‌ద్మా దేవేంద‌ర్ రెడ్డి

trs mla escaled from road accident
  • అక్క‌న్న‌పేట వ‌ద్ద రోడ్డు ప్ర‌మాదం
  • వెనుక నుంచి వ‌చ్చిన కారు ఢీకొన్న వైనం
  • గాయాలేమీ కాకుండానే బ‌య‌ట‌ప‌డ్డ ఎమ్మెల్యే
టీఆర్ఎస్ కీల‌క నేత‌, మెద‌క్ ఎమ్మెల్యే ప‌ద్మా దేవేంద‌ర్ రెడ్డికి పెను ప్ర‌మాదం త‌ప్పింది. ఎమ్మెల్యే ప్ర‌యాణిస్తున్న కారు అల్లంత ఎత్తున ఎగిరిప‌డినా.. చిన్న‌పాటి గాయాలేమీ కాకుండానే ఆమె బ‌య‌ట‌ప‌డ్డారు. మెద‌క్ జిల్లా ప‌రిధిలోని అక్క‌న్న‌పేట రైల్వే గేటు స‌మీపంలో ఈ ప్ర‌మాదం సంభ‌వించింది.

ఈ ప్ర‌మాదం వివ‌రాల్లోకి వెళితే.. బుధ‌వారం నాడు మెద‌క్ ప‌ట్ట‌ణంలో ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్న అనంత‌రం ప‌ద్మా దేవేంద‌ర్ రెడ్డి రామాయంపేట‌లో జ‌రుగుతున్న ఓ వివాహానికి హాజ‌ర‌య్యేందుకు బ‌య‌లుదేరారు. ఈ క్ర‌మంలో అక్క‌న్న‌పేట రైల్వే గేటు వ‌ద్ద‌కు వ‌చ్చేస‌రికి వెనుక నుంచి వ‌చ్చిన కారు ఎమ్మెల్యే కారును బ‌లంగా ఢీకొట్టింది. దీంతో ఎమ్మెల్యే కారు భారీ శబ్దంతో అల్లంత ఎత్తున ఎగిరిప‌డింది. అయితే ఈ ప్ర‌మాదంలో ఎమ్మెల్యేకు గానీ, కారులోని ఇత‌రుల‌కు గానీ ఎలాంటి గాయాలు కాలేదు.
Padma Devendar Reddy
TRS
Road Accident

More Telugu News