Raviteja: 'రామారావు ఆన్ డ్యూటీ' రిలీజ్ డేట్ ఖరారు!

  • రవితేజ తాజా చిత్రంగా 'రామారావు ఆన్ డ్యూటీ'
  • దర్శకుడిగా శరత్ మండవ పరిచయం 
  • కథానాయికలుగా దివ్యాన్ష -  రజీషా 
  • జూన్ 17వ తేదీన విడుదల
Ramarao On Duty movie release date confirmed

రవితేజ హీరోగా ఇటీవల వచ్చిన 'ఖిలాడి' సినిమా థియేటర్ల నుంచి ఆశించిన స్థాయి రెస్పాన్స్ ను రాబట్టలేదు. ఆ తరువాత ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చిన ఈ సినిమాకి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. రవితేజ మార్క్ మాస్ కంటెంట్ ఉన్నప్పటికీ వర్కౌట్ కాలేదు. ఆ తరువాత సినిమాగా రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' చేశాడు.

ఈ సినిమాతో దర్శకుడిగా శరత్ మండవ పరిచయమవుతున్నాడు. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకి రిలీజ్ డేట్ ను ఖరారు చేశారు. జూన్ 17వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు చెబుతూ, అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను వదిలారు. ఏప్రిల్ .. మే నెలలో భారీ సినిమాలు ఉండటమే అందుకు కారణం కావొచ్చు. 

సామ్ సీఎస్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, దివ్యాన్ష కౌశిక్ - రజీషా విజయన్ కథానాయికలుగా అలరించనున్నారు. సీనియర్  హీరో వేణు తొట్టెంపూడి ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇతర ముఖ్య పాత్రల్లో నాజర్ .. నరేశ్ .. పవిత్ర లోకేశ్ కనిపించనున్నారు.

More Telugu News