Nizamabad District: సోష‌ల్ మీడియాలో త‌ప్పుడు ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవు: నిజామాబాద్ పోలీస్‌ కమిషనర్

nizamabad cp warns
  • నిజామాబాద్ జిల్లా బోధన్‌లో శివాజీ విగ్రహం ఏర్పాటు వివాదం
  • ఉద్రిక్తతలకు దారితీసిన వైనం
  • సామాజిక మాధ్య‌మాల్లో త‌ప్పుడు ప్ర‌చారాలు
  • రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నాలు చేస్తే చ‌ర్య‌లు

నిజామాబాద్ జిల్లా బోధన్‌లో శివాజీ విగ్రహం ఏర్పాటు వివాదం ఉద్రిక్తతలకు దారితీసిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల‌ ఇరు వర్గాలకు చెందిన ఆందోళనకారులు ఘ‌ర్ష‌ణ‌కు దిగ‌డంతో పోలీసులు టియర్ గ్యాస్ కూడా ప్రయోగించారు. ఇప్ప‌టికీ అక్క‌డ ఉద్రిక్త ప‌రిస్థితులు కొన‌సాగుతుండ‌డంతో పోలీసులు అలెర్ట్ గా వున్నారు. 

దీనిపై సామాజిక మాధ్య‌మాల్లో త‌ప్పుడు ప్ర‌చారాల‌తో కొంద‌రు రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నాలు చేస్తుండడంతో, ఇటువంటి ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవని నిజామాబాద్ పోలీస్‌ కమిషనర్ నాగరాజు హెచ్చ‌రించారు. కొంతమంది ఉద్దేశ‌పూర్వ‌కంగా శాంతిభద్రతలకు భంగం కలిగే విధంగా వాట్సప్‌, ఫేస్‌బుక్, ట్విట్ట‌ర్‌లో పోస్టులు పెడుతున్నారని ఆయ‌న అన్నారు. అలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డితే కఠినంగా వ్యవహరిస్తూ కేసులు నమోదు చేస్తామ‌ని అన్నారు. 

  • Loading...

More Telugu News